సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 17: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజాపాలన (Prajapalana) కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ (Congress) సర్కార్ ఎంపిక చేసిన పైలట్ గ్రామమైన తంగళ్ళపల్లి మండలం రాళ్లపేటలో బీఆర్ఎస్ (BRS) జెండా ఎగిరింది. రెండో విడతలో ఈ నెల 14న నిర్వహించిన ఎన్నికల్లో (Sarpanch Elections) రాళ్ళపేట సర్పంబ్గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బాలసాని పరుశరాములు గౌడ్ గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లోనూ ఆయనే విజయం సాధించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన పైలట్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి వరుసగా రెండోసారి గెలుపొందడంతో సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. పైలట్ గ్రామంలో కాంగ్రెస్ పథకాలు ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల తో పాటు ఇతర పథకాలు కూడా ప్రభావం చూపకపోవడం గమనార్హం. ప్రజా పాలనలో పైలట్ గ్రామంగా ఎంపిక చేసినా ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపడం తంగళ్ళపల్లి మండలంలో చర్చ నియాంశంగా మారింది.