Panchayat Secretary | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 23: రాజన్న సిరిసిల్ల జిల్లాలో అదృష్టమైన పంచాయతీ సెక్రెటరీ ప్రియాంక క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జిల్లా కడప ప్రాంతంలో ఆచూకీ లభ్యమైనట్లు పేర్కొన్నారు. ఆమె తండ్రి రాజేశం, కుటుంబ సభ్యుల తో కలిసి తిరిగి వస్తున్నది. కాంగ్రెస్ నేతల ఒత్తిడి, వేధింపులతో ఈనెల 21న డీపీవో, ఎంపీడీవోలకు రాజీనామా పత్రాలను వాట్సాప్ ద్వారా పంపించి, తాను వెళ్లిపోతున్నట్టు లేఖ రాసి ఆజ్ఞాతంలోకి వెళ్ళిన విషయం తెలిసిందే.
దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన గురై సిరిసిల్ల డిఎస్పీకి ఫిర్యాదు చేయ గా, తిరుపతి ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం పోలీసుల సహకారంతో ప్రియాంక తండ్రి రాజేశం, కుటుంబ సభ్యులు ప్రియాంక కోసం వెళ్లారు. అక్కడ కడప ప్రాంతంలో ప్రియాంక ఆచూకీ లభ్యమవగా, వెంట తీసుకొని తిరిగి వస్తున్నారు. తన కూతురు ప్రాణాలతో దక్కడం పట్ల తండ్రి రాజేశం, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఇలా ఉండగా పంచాయతీ కార్యదర్శి ప్రియాంకను కాంగ్రెస్ నేతల వేధింపులపై బీఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు ఇతర నాయకులు కూడా తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే.
పంచాయతీ కార్యదర్శి అండగా ఉంటామని మాజీ ఎంపీ వినోద్ కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నేత మాట్ల మధు భరోసా నిచ్చారు. అంతే కాకుండా కారణమైన వారిని చట్టపరంగా చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు. బాధ్యులపై ఎలాంటి చర్యలు ఉంటాయో వేచి చూడాలిసిందే. జిల్లాలో సంచారం సృష్టించిన పంచాయతీ కార్యదర్శి ప్రియాంక ఘటన సుఖాంతం కావడంతో ఇల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.