Alumni reunion | రుద్రంగి, జూన్ 08 : రుద్రంగి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 1999-2000 సంవత్సరంలో చదివిన పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకొని ప్రస్తుత అనుభవాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. పాఠశాలలో స్నేహితులు పదో తరతగతి వరకు కలిసి ఉంటారని, వారి బంధం విడదీయలేనిదని అన్నారు. 25 సంవత్సరాల తరువాత తమతో చదివిన చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం వారికి విద్యాబోధనలందించిన అప్పటి ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించారు.
ప్రతీ ఒక్కరూ గురువులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఇలాంటి గురువులతో సరదా సమయాన్ని గడపడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
Badibata | బడిబాట కార్యక్రమం ప్రారంభించిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ పోచయ్య
Edupayala | ఏడుపాయలలో భక్తుల సందడి
Telangana Cabinet | తెలంగాణ కేబినెట్లోకి ముగ్గురు మంత్రులు.. రాజ్భవన్లో ప్రమాణస్వీకారం పూర్తి