Hanging | ఎల్లారెడ్డిపేట, మే, 5 : పెళ్లి కావడం లేదని బెంగతో మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. ప్రొహిబిషన్ ఎస్సై లక్ష్మణ్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఒగ్గు మహేష్(23) కు గత కొంతకాలంగా పెళ్లి చూపులు చూస్తున్నప్పటికీ సంబంధాలు క్యాన్సల్ అవుతూ వస్తున్నాయి.
దీంతో మనస్థాపానికి లోనైన మహేష్ ఎల్లారెడ్డిపేట శివారులో ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు.