National SC Commission | పెద్దపల్లి పట్టణం భూమ్ నగర్లో తమకు సంబంధించిన ఇంటి స్థలం భూమిలో కొంతమంది సంబంధం లేని వ్యక్తులు ఇల్లు కబ్జా చేసి, తప్పుడు మార్గంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని, కులం పేరుతో బూతులు తిడుతూ తమను ఇబ్బందులకు గురి చేస్తూ చంపడానికి ప్రయత్నిస్తున్నారని, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ ను కలిసి బాధితులు తమ గోడును వెల్లబోసుకుంటూ సమస్యలను వివరిస్తూ మొర పెట్టుకున్నారు.
అనంతరం తమకున్న డాక్యుమెంట్లను చూపించి సమస్య తీర్చాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. సోమవారం రాత్రి 9 గంటలకు ఎన్టీపీసీ గెస్ట్ హౌస్‌లో, పెద్దపల్లి పట్టణం భూమ్ నగర్‌కు సంబంధించిన ఇంటి స్థలం భూమి బాధితులు మన్యంపల్లి యేసుమని, రాజ్యలక్ష్మి జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులుడు వడ్డేపల్లి రామ్ చందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను తెలియజేశారు.
పెద్దపల్లి పట్టణం భూమ్ నగర్లో తమ భర్తల కష్టార్జితంతో సర్వే నెంబర్ 668లో కొనుగోలు చేసిన ఇంటి స్థలం భూమిని కొంతమంది రాజకీయ నాయకుల అండతో, పెద్దపల్లికి చెందిన దేవరకొండ సత్యనారాయణ, దేవరకొండ నరసింహచారిలు, జిల్లా కోర్టు నుండి హైకోర్టు వరకు మాకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ కోర్టు తీర్పులను ధిక్కరించి మమ్మల్ని కులం పేరుతో తిడుతూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ దృష్టికి తీసుకువెళ్లారు.
సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ..
పెద్దపల్లి పట్టణం భూమ్ నగర్లో 204+204 గజాలకు సంబంధించిన భూమిపై కన్ను వేసిన కొంతమంది రాజకీయ నాయకులు తమ భూమిని కబ్జా చేయాలన్న దురుద్దేశంతో దేవరకొండ సత్యనారాయణ, దేవరకొండ నరసింహచారిలను ఉసిగొలిపి మమ్మల్ని అనేక ఇబ్బందులకు, మానసిక వేదనకు గురి చేస్తూ కులం పేరుతో అవమానపరుస్తూ.. తిడుతున్నారని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు సీరియస్‌గా స్పందిస్తూ తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడుతానని.. సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన తమకు సంబంధించిన ఇంటి స్థలం భూమిలో సంబంధం లేని వ్యక్తులు కలుగచేసుకొని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కులం పేరుతో తిడుతున్నారని ఆవేదన చెందారు.
జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామ్ చందర్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని.. సంబంధిత అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వ్యక్తులపై, కులం పేరుతో తిడుతూ బెదిరింపులకు గురి చేస్తున్న వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బెదిరింపులు, హత్యాయత్నం తదితర చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు, కుర్మపల్లి మాజీ సర్పంచ్ మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు బొంకూరి మధునయ్య, మాజీ జెడ్పీటీసీ ఆల్ ఇండియా అంబేద్కర్ యువ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు లంక సదయ్య, రాష్ట్ర కార్యదర్శి మంథిని లింగయ్య, జిల్లా కో కన్వీనర్, సంకన పల్లి లక్ష్మయ్య, మాజీ సర్పంచ్ బాసంపల్లి కొండయ్య, దళిత నాయకులు కుక్క కనకరాజు, కుక్క మల్లేష్, సతీష్ తదితరులు వారి వెంట ఉన్నారు.
Drinking Water | మిషన్ భగీరథపై అధికారుల నిర్లక్ష్యం.. నీరు వృథాగా పోతున్నా పట్టింపు కరువు
Kollapur Mangos | కొల్లాపూర్ మామిడి రైతులను ఆదుకోవాలి : బీఆర్ఎస్ నాయకులు అభిలాష్ రావు
Rayapol ZPHS | విద్యా వెలుగులకు నెలవై.. రాయపోల్ పెద్ద బడికి నేటికి 60 వసంతాలు