Fruits Shops | కోల్ సిటీ, మార్చి 8 : గోదావరిఖని ప్రధాన రాజీవ్ రహదారి ఆనుకొని ఉన్న ప్రధాన కూరగాయల మార్కెట్ ఎదురుగా పండ్ల దుకాణాలతో నిత్యం వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు పండ్ల కొనుగోళ్ల కోసం వచ్చే వాహన చోదకులు రోడ్డు మధ్యలోకి వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు.
ప్రధాన రోడ్డు కావడంతో ఆర్టీసీ బస్సులతోపాటు ద్విచక్ర వాహన చోదకుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. గతంలో ట్రాఫిక్ పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టగా కొద్దిరోజులు సద్దుమణిగినట్లే మణిగి.. మళ్లీ అదే తంతు కొనసాగుతుంది.
ప్రధాన రోడ్డుపైనే వాహనాలు ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తుండడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థ కమిషనర్ గానీ, పోలీసు ఉన్నతాధికారులు గానీ జోక్యం చేసుకొని తగిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
Jangaon | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి..
BRS leader matla madhu | మాట్ల మధు కమీషన్లు తీసుకుంటాడన్న ఆరోపణలపై జిల్లెల్ల గ్రామస్తుల ఫైర్