Union Bank Of India | జూలపల్లి, ఆగస్టు 19 : జూలపల్లి మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) సేవలు గత రెండు రోజుల నుంచి ఖాతాదారులకు అందడం లేదు. సాంకేతిక సమస్యలతో తరచూ లావాదేవీలకు అంతరాయం కలగడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల వరుస సెలవులకు తోడు నో నెట్వర్క్ సమస్య ఖాతాదారులను పట్టిపీడిస్తోంది.
బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సక్రమంగా పనిచేయకపోవడంతో సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నదని ఖాతాదారులు వాపోయారు. లావాదేవీలు కొనసాగక తిప్పలు తప్పడం లేదని పేర్కొంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి బ్యాంకుకు వచ్చిన వినియోగదారులు విసుగుచెందుతున్నారు. తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వినియోగదారులు నిరాశతో వెనుతిరిగి పోతున్నారు. ఆటంకాలు లేకుండా బ్యాంకు సేవలు యధావిధిగా అందించాలని పలువురు వినియోగదారులు కోరుతున్నారు.
Vice president | ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ జడ్జి..!
Yellampally project | ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పై నుంచి రాకపోకలు బంద్
TLM Mela | టీఎల్ఎం మేళాతో బోధన సులభతరం : ఎంఈవో చంద్రశేఖర్ రెడ్డి