May flower | గోదావరిఖని : సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 1 జనరల్ మేనేజర్ కార్యాలయం పర్సనల్ డిపార్ట్మెంట్ విభాగంలో సేవా సమితి కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న మేడి తిరుపతి ఇంట్లో మే పుష్పం పూసి కనువిందు చేస్తుంది. రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ లో నివాసముండే తిరుపతి ఇంట్లో సంవత్సరానికి ఒకసారి మే నెలలో పూసే పుష్పం మే మాసం ముగియకముందే పూయడంతో చుట్టుపక్కల వారు ఆ పుష్పాన్ని చూడడానికి తరలివస్తున్నారు.
ఈ సందర్భంగా మేడి తిరుపతి మాట్లాడుతూ పుష్పం పూసిన తర్వాత 20 రోజులపాటు ఆకర్షణీయంగా ఉంటుందని అన్నారు. ఇది ఒక బంతిలాగా గుండ్రంగా పుప్పొడి రేణువులతో ఆకర్షణీయంగా, అందంగా ఉందని ఆయన తెలిపారు. ప్రతీ సంవత్సరం మే మాసంలోనే ఈ పువ్వు పూసి 20 రోజులపాటు వాడిపోకుండా ఫ్రెష్ గా ఉంటుందని ఆయన చెప్పారు. మే పుష్పాన్ని చూడడానికి చుట్టుపక్కల వారు వచ్చి వివరాలు అడిగి ఫొటోలు దిగి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.