Dasari Manohar Reddy | పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 29 : చదువుకునే సమయం నుంచే మంచి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తూ జ్ఞానం పెంచుకుంటే అన్నింటా విజయమే సొంతమవుతుందని ట్రినిటీ విద్యాసంస్థల అధినేత, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు.
ఇవాళ పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో 2024-25 కల్చరల్ బాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రాడ్యుయేషన్ చదువులతోనే ఐఏఎస్‌లుగా ఉన్నత స్థాయి అధికారులుగా అవకాశాలను అందిపుచ్చుకుని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని అన్నారు.
అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నీతారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ , అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
BRS | వరంగల్ సభతో కాంగ్రెస్ పతనం ప్రారంభం : బీఆర్ఎస్ నాయకులు
Mayday | మేడేను విజయవంతం చేయండి : సీపీఐ నాయకులు
Sircilla | ఇంట్లో చోరీకి యత్నించిన ఏఎస్ఐ.. పట్టుబడటంతో దేహశుద్ధి