Ramagundam municipality | కోల్ సిటీ, డిసెంబర్ 30 : తమ దుకాణాల సమస్యలకు ‘దారి’ చూపాలంటూ 6 నెలలుగా పలువురు రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తున్నారు. పరిష్కార ‘మార్గం’ కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నెల నెలా కార్యాలయానికి వచ్చి కమిషనర్‌కు మళ్లీ ఫిర్యాదు చేయగా స్పందించి టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించడమే సరిపోతుందనీ, మోకా మీదకు ఇప్పటికీ ఎవరూ రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం కార్యాలయానికి వచ్చిన బాధితులు ‘నమస్తే తెలంగాణ’కు తమ గోడు వెల్లబోసుకున్నారు.
నగర పాలక సంస్థ పరిధిలోని ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్డు వద్ద 30 యేళ్లుగా నివాసం ఉంటున్నామనీ, కొంత కాలంగా ప్రధాన రోడ్డు ప్రక్కన మరికొన్ని దుకాణాలు వెలవడంతో తమ షాపులకు దారి మూసుకుపోతుందనీ, 18 ఫీట్ల దారి కోసం మార్కింగ్ ఇవ్వాలని గత జూన్ 7న కార్యాలయంలో కమిషనర్ కు బాధితులు వినోద్, ఆర్. రాజేశం, సీహెచ్ ఎల్లయ్య, ఎం చంద్రయ్య, పీ సత్యం, దేవేందర్ రెడ్డి, జీ మనోహర్ రావులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రోడ్డుపైకి నిర్మాణాలు ఉండటంతో తాము ఉపాధి కోల్పోతున్నామని వాపోయారు. రోడ్డు వెడల్పు 18 ఫీట్లు మార్కింగ్ లేకపోవడం వల్ల రోడ్డు ఆక్రమణలతో తమ నివాసాలకు రాకపోకలు ఇబ్బందికరంగా ఉందని పేర్కొన్నారు.
విద్యుత్ స్తంభం, వీధి లైట్లు లేకపోవడం వల అంధకారం నెలకొందన్నారు. ఈ సమస్యలపై ఇప్పటికీ ఆరుసార్లు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ విషయమై టీపీఓ నవీన్‌ను వివరణ కోరగా, త్వరలోనే క్షేత్ర స్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని, లక్ష్మీనగర్‌లో వెడల్పు పనుల వల్ల కొంత అలస్యం జరుగుతుందని తెలిపారు.
Sannia Ashfaq: నా ఇంటిని ముక్కలు చేశారు.. విడాకులపై పాకిస్థాన్ క్రికెటర్ భార్య ఆవేదన