పెద్దపల్లి రూరల్ : విద్యార్థులు(Students )చదువుకునే వయస్సు నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ముందుకు సాగాలని బసంత్ నగర్ ఎస్ఐ కె.స్వామి అన్నారు. పెద్దపల్లి మండలంఅప్పన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. చదువుకునే దశలో విద్యార్థులు సైబర్ నేరాలు, గంజాయి తదితర దురలవాట్లపై అవగహన కల్పించారు.
సాధ్యమైనంత వరకు చెడువ్యసనాలకు దూరంగా ఉంటేనే మంచి భవిష్యత్ ఉంటుందని సూచించారు. తల్లి దండ్రులు మీ భవిష్యత్ కోసం పడుతున్న కష్టాలను గుర్తు ఉంచుకుని బాగా చదవాలన్నారు. తల్లిదండ్రుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని సూచించారు. చదువుతోనే సమాజంలో సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం పురుషోత్తం, పీఈటీ డాక్టర్ వేల్పుల సురేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.