– కాడలి కృష్ణ, ఎల్బీ నగర్
చావు పుట్టుకలు అనేవి కర్మ ఫలితాలు. ఒక ఇంట్లో పుట్టాలన్నా, చనిపోవాలన్నా ఎంతో పూర్వ చరిత్ర ఉంటుంది. జన్మలు దైవదత్తం. మనం కోరుకొని పుట్టే అవకాశం లేదు కదా! అయితే ఏదో ఒకరోజూ అందరూ చనిపోవాల్సిందే. అయినా, కొన్ని ఇండ్లు మనిషి ఆయుష్షును నిర్ధారిస్తాయి. వీధిశూల ఉన్న ఇల్లు ఎంచుకొని వస్తారు. అది దోషమని తెలిశాక ఖాళీ చేస్తారు.
బతికేవాళ్లు ఖాళీ చేయగానే.. చనిపోయేవాళ్లు వెళ్లి అందులో చేరుతారు. కొందరు ప్రమాదానికి గురైయ్యే బస్సును పరిగెత్తి మరీ, చివరి నిమిషంలో ఎక్కుతారు. కొంతమంది వేరే బస్సు చూసుకొని వెళ్లిపోతారు. అలా వ్యక్తుల అంతరంగాలకు వారికి తెలియకుండానే విశ్వనియంత నడిపిస్తుంటాడు. ఇంటి దోషాలు అకాల మరణ హేతువులు కాకుండా ఉండాలి. మనోప్రేరణకు సంబంధించి చెడు నడకలు తొక్కకుండా ఉపకరించాలి. దోషరహిత గృహంలో నిబద్ధత కలిగిన జీవన సరళి ఉన్నవారికి ప్రకృతి సదా మంచి అవకాశాలను అందిస్తుంది. జీవితాన్ని సంపూర్ణంగా చేసుకోవడం కోసం గృహ జీవనం బాగుండాలి.
– మురళీకృష్ణ, మంథని
పడమర, దక్షిణం రోడ్లు వచ్చినప్పుడు కూడా ఇల్లు ఎత్తుగానే ఉండాలి. మన చుట్టూ ఉన్న స్థలం, రోడ్డు కంటే ఇల్లు ఎత్తులో ఉండాలి. తద్వారా మనం ముందు స్థానశక్తిని సంపాదించుకున్న వాళ్లమవుతాం. దక్షిణం రోడ్డు ఉంది కదా! ఉత్తరం వైపు డౌన్ ఉండవచ్చని కిందికి ఇల్లు కట్టవద్దు. అది నీళ్లు నిండటానికి అవకాశం ఇస్తుంది.

మీ రోడ్డును బట్టే ఇంటి ఫ్లోరింగ్ భాగాన్ని, కాంపౌండులోని భాగాన్ని ఎత్తులో నిర్మించుకోవాలి. రోడ్డు మీదనుంచి గేటు వద్దకు కనీసం ఒకటిన్నర అడుగుల ఎత్తు, అక్కడి నుంచి ఇంటి ఫ్లోరింగ్ రెండు అడుగుల ఎత్తయినా ఉండాలి. అప్పుడే ఇంట్లో మంచి వాతావరణం నెలకొంటుంది.
– దేవుల రాజు, లింగంపల్లి
రాళ్లకున్న శక్తి గొప్పది. వాటి ఆయుష్షు మనిషి కన్నా ఎక్కువ. కొన్ని వ్యవసాయ బావులు తొలగించినప్పుడు మోటబావికి ఉన్న పెద్దపెద్ద కడీలను తొలగించిన తరువాతే ఆ బావిని పూడుస్తారు. వాటిని ఇంటి కాంపౌండ్ గోడకు పునాదిగా వాడుకోవచ్చు.

పగుళ్లు రాని రాళ్లను వేరు చేసి వాటిని టెస్ట్ చేయాలి. లేపి కిందేసినపుడు అవి పగలకుండా ఉంటే.. అవి బలంగా ఉన్నట్లు అర్థం. అయితే వాటిని ఇంటి పునాదికి వాడకూడదు. గృహం కొత్త శక్తులతో రూపొందాలి. నిర్మాణంలో కొత్త వాటిని వాడటం వల్ల తరతరాలకూ నిలిచుంటాయి. అలాంటి పాత రాళ్లను ఇతర కొట్టాలకు, ఉప గదులకు వాడుకోవచ్చు.
– దాసరి గౌతమి, కీసర
ఇటీవల అందరికీ ఈ వంటగదుల వ్యాధి పాకిపోయింది. ఒకరిని చూసి మరొకరు వెట్ కిచెన్ అని, డ్రై కిచెన్ అని రెండేసి వంటగదులు ఏర్పాటు చేసుకుంటున్నారు. మీరు కూడా అలానే నిర్మించుకోవాలనుకుంటే ఆగ్నేయంలో రెండు కిచెన్లకు స్థల విభజన చేయడం కుదరదు గనుక ఒకటి ఆగ్నేయంలో, రెండోది వాయవ్యంలో పెట్టుకోండి. ఆగ్నేయం దిశ పరిధి మేరకు ఇంటి వైశాల్యాన్ని బట్టి పరిమితమైన కొలత వస్తుంది.

రెండుగా విభజన చేయడం వల్ల రెండు గదుల వైశాల్యాన్ని తీసుకోవాలి. అప్పుడు ఇంట్లోని విభజనలో వత్యాసం వస్తుంది. ఆగ్నేయం పెరగదు. అది తూర్పును గానీ దక్షిణ దిశను గానీ ఆక్రమించి ఉండాల్సిన పరిధిని దాటి ఇంటి శక్తిని విచ్ఛిన్నం చేస్తుంది. ఒకేచోట రెండు కిచెన్లు పెట్టుకోవడం కూడా మంచిది కాదు. ప్రతి గదికీ దానికి అనుకూలమైన కొలమాన విధానం ఉంది. దానిని అనుసరించి కట్టుకోవాలి. రెండు కిచెన్లు అనవసరమని నా అభిప్రాయం.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143