హన్సి ప్రొడక్షన్స్ పతాకంపై ఓ యువతరం ప్రేమకథ రూపొందుతున్నది. జగన్ యోగిరాజు, నవ్య చిట్యాల జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రఘువర్ధన్ కోట్ల దర్శకుడు. శ్రీహన్సిక పెద్దిరెడ్డి నిర్మాత. శనివారం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మహూర్తపు సన్నివేశానికి శ్రీధర్ పెద్దిరెడ్డి క్లాప్ ఇవ్వగా, స్రవంతి పెద్దిరెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. శ్రీహన్సిక పెద్దిరెడ్డి స్క్రిప్ట్‌ని దర్శకుడికి అందించారు. ‘సినిమా నిర్మించడం నా కల. అభిరుచితో బాధ్యతగా అన్నింటికంటే ముఖ్యంగా ప్రేమతో ఈ సినిమాను నిర్మిస్తున్నాను.
నిర్మాతగా నా తొలి సినిమా ఓ అందమైన ప్రేమకథ కావడం ఆనందంగా ఉంది. అందరూ ఆస్వాదించేలా సినిమా నిర్మిస్తాం’ అని నిర్మాత శ్రీహన్సిక పెద్దిరెడ్డి నమ్మకంగా చెప్పారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ చిత్రంలో దేవీప్రసాద్, లక్ష్మణ్ మీసాల, సునందిని ఇతర పాత్రధారులు ఈ చిత్రానికి కెమెరా: సాయివంశీ దాచపల్లి, సంగీతం: రాజీవ్‌రాజ్, సహనిర్మాత: తవిటిరాజు తలచింతల.