Jobs | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) రిక్రూట్మెంట్ 2026లో భాగంగా 212 స్పెషలిస్ట్ పోస్టుల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనలో ఏడు కేటగిరీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (అనాటమీ, జనరల్ మెడిసిన్), అసిస్టెంట్ ఎడిటర్, అనస్థీషియాలజీ, పీడియాట్రిక్స్‌లో, గ్రేడ్-2 (జూనియర్ స్కేల్) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పబ్లిక్ లా ఆఫీసర్/డిస్ట్రిక్ట్ లిటిగేషన్ ఆఫీసర్/లా ఆఫీసర్ వంటి పోస్టులను నింపనున్నారు. వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమయ్యింది. అక్టోబర్ 2 వరకు కొనసాగుతుంది. అర్హులు, అనుభవం ఉన్నవారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఖాళీల వివరాలు
స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (అనాటమీ)- 4
స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (జనరల్ మెడిసిన్)- 60
అసిస్టెంట్ ఎడిటర్- 2
స్పెషలిస్ట్ గ్రేడ్-2 జూనియర్ స్కేల్ (అనస్థీషియాలజీ)- 1
స్పెషలిస్ట్ గ్రేడ్-2 జూనియర్ స్కేల్ (పీడియాట్రిక్స్)- 1
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్- 140
పబ్లిక్ లా ఆఫీసర్/డిస్ట్రిక్ట్ లిటిగేషన్ ఆఫీసర్/లా ఆఫీసర్- 4
పై పోస్టులను డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC), డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్, లా అండ్ జస్టిస్ డిపార్ట్మెంట్ (లడఖ్)లలో భర్తీ చేస్తారు.

Upsc Posts
అర్హతలు
అభ్యర్థులు పోస్టును బట్టి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీబీఎస్, ఎల్ఎల్బీ, పీహెచ్డీ పూర్తి చేసి ఉండాలి. కనీసం 3 ఏండ్ల అనుభవం ఉండాలి.
వయసు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (అనాటమీ)కి 40, ఎస్సీలకు 45 ఏండ్లు ఉండాలి. జనరల్ మెడిసిన్‌కు 40, ఓబీసీలకు 43, ఎస్సీలకు 45, అనస్థీషియాలజీకి ఎస్టీలకు 50, పీడియాట్రిక్స్‌కు ఈడబ్ల్యూఎస్‌లకు 45 ఏండ్లు ఉండాలి. అసిస్టెంట్ ఎడిటర్‌కు 30, ఎస్సీలకు 35 ఏండ్లు ఉండాలి. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు 35, ఓబీసీలకు 38, ఎస్సీ, ఎస్టీలకు 40 ఏండ్లు ఉండాలి. పబ్లిక్/ డిస్ట్రిక్ట్ లిటిగేషన్/ లా ఆఫీసర్‌కు ఎస్టీలకు 40 ఏండ్లు ఉండాలి. దివ్యాంగులకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
దరఖాస్తు ఫీజు రూ. 25. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

Apply
ఎంపిక
ప్రధానంగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుల సంఖ్యను బట్టి రిక్రూట్మెంట్ టెస్ట్ (RT) నిర్వహిస్తారు. ఎంపికైనవారికి జీతం పే లెవల్- 8, 10, 11 (7వ CPC) ఆధారంగా ఇస్తారు.
చివరితేదీ
దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభమయ్యింది. అక్టోబర్ 2 వరకు సాగుతుంది. యూటీ లడఖ్ పోస్టులకు అక్టోబర్ 9 వరకు ఉంది. అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాలకు వెబ్సైట్ https://upsconline.nic.inలో చూడండి.