కాల్వ శ్రీరాంపూర్ సెప్టెంబర్ 16 : గ్రామాల్లో అర్హులైన నిరుపేదలను గుర్తించి జాబ్ కార్డులు ఇచ్చి, పని కల్పించాలని ఈజీఎస్ ఏపీడీ సత్యనారాయణ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ సమావేశ మందిరంలో 15 వ విడత ఈజీఎస్ సామాజిక తనిఖీ ప్రజావేదికను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 24 గ్రామాల్లో చేసిన పనులపై చర్చించారు. ఉపాధి హామీ పథకంలో 4కోట్ల 45 లక్షల 49వేలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఉపాధి పనుల్లో అవకతవకలకు పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్లకు నోటీసులతో పాటు, జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి గ్రామంలో కూలీల సంఖ్యను పెంచి, మొక్కలు నాటాలని సూచించారు. చేసిన ప్రతి పనికి ఎంబీ రికార్డు చేయాలన్నారు. ప్రతి ఒక్కరు విధిగా బాధ్యతగా పని చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో సరిగా విధులు నిర్వహించని, అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏవీవో కొమురయ్య, ఎంపీడీవో పూర్ణచందర్రావు, క్వాలిటీ కంట్రోలర్ మల్లిఖార్జున్, పీఆర్ ఏఈ పవన్, తనిఖీ అదికారులు శరత్, హరికృష్ణ, ఏపీవో మంజుల, ఆయా గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.