Singareni Labourers | గోదావరి ఖని : సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 1 పరిధిలోని జీడీకే 11 ఇంక్లయిన్ గనిపై 24 గంటల పాటు సింగరేణి సంజీవని అంబులెన్స్ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసినట్లు జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ తెలిపారు. యూనియన్ నాయకులు, గని అధికారులు ఉద్యోగుల అభ్యర్ధన మేరకు గనిపై 24 గంటలపాటు కార్మికులకు అంబులెన్స్ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు
గతంలో గనిపై ఏదైనా ప్రమాదం సంభవించి కార్మికుడు అస్వస్థతకు గురైతే ఏరియా హాస్పిటల్ నుండి అంబులెన్స్ రావటంలో ఆలస్యం జరిగేదని జీడీకే 11 ఇంక్లయిన్ గని దూరం అవటం వలన కొన్ని సమయాలలో అంబులెన్స్ రావటానికి సమయం ఎక్కువ వృధా అయ్యేదన్నారు. ఇట్టి సమస్యను నా దృష్టికి తీసుకువచ్చిన వెంటనే స్పందించి జీడీకే 11 ఇంక్లయిన్ గని వద్ద 24 గంటలపాటు అంబులెన్స్ అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేయటం జరిగిందన్నారు.
ఏదేని ప్రమాదాలు జరిగితే వెంటనే సాధ్యమైనంత త్వరగా హాస్పిటల్కు పంపించినట్లైతే ప్రమాద శాతం తగ్గుతుందని ఇట్టి ‘గోల్డెన్ అవర్’ సమయం చాలా కీలకమైందని జీఎం తెలిపారు. ప్రతీ ఉద్యోగి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ రక్షణతో విధులను నిర్వహించాలని, ప్రమాద రహిత అర్జీ 1 ఏరియాగా తీర్చిదిద్దుటలో ప్రతీ ఒక్కరు కుడా భాగస్వాములు కావాలని జీఎం తెలిపారు.
24 గంటలపాటు గని వద్ద అంబులెన్స్ అందుబాటులో ఉంచటం ఒక మంచి ఆలోచన అని అవసరమైతే మునుముందు కుడా అన్ని గనులపై అంబులెన్స్ అందుబాటులో ఉండేలా చూస్తామని, ఇందులో భాగస్వాములైన వారిని జీఎం ప్రత్యేకంగా అభినందించారు.
Read Also :
Jagtial | జగిత్యాల జిల్లాలో కొండెక్కిన చింత చిగురు ధరలు.. కిలో ఎంతంటే?
MLC Kavitha | రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Stampede | పాఠశాల వద్ద పేలుడు.. తొక్కిసలాటలో 29 మంది చిన్నారులు మృతి