కోల్ సిటీ, మార్చి 20: ఎడారిగా మారిన గోదావరి(Godavari) తల్లి కన్నీటి గోస చూడలేక బీఆర్ఎస్ నాయకుడు బొడ్డు రవీందర్ శ్రీకారం చుట్టిన గోదావరి కన్నీటి గోస మహా పాదయాత్ర బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ నాయకత్వంలో గోదావరిఖని నుంచి ఎర్రబెల్లి వరకు సాగనున్నది. ఈ మహా పాదయాత్ర ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్విఘ్నంగా విజయవంతం కావాలని, అందుకు అమ్మవారు శక్తిని ప్రసాదించాలని వేడుకుంటూ రామగుండం నగరపాలక సంస్థ 12వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత, రవీందర్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చీల్చుతూ..గోదావరి నదికి పూర్వవైభవం వచ్చేలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కొలిచారు. కార్యక్రమంలో రాసమల్ల విజయ్, మేకల నవీన్, ఎర్రోళ్ల రాజు, కుంచం శ్రీకాంత్, పవన్, మారుపాక కవిత, మేకల శిరీష తదితరులు పాల్గొన్నారు.