Pilgrimage | పెద్దపల్లి, మే27: తీర్ధ యాత్రలకు వెళ్లే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం వచ్చే నెల నుంచి 14 నుంచి 22 వరకు, జూలై 5 – 13వ వరకు రెండు ప్యాకేజీలుగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను సికింద్రాబాద్/హైదరాబాద్ నుంచి నడపనుంది.
ఈ యాత్రలో కాశీ, వారణాసి, అయోధ్య, నైమిశారణ్య, ప్రయాగరాజ్, శృంగవర్పూర్ ప్రాంతాలు దర్శించవచ్చు. ఈ యాత్ర జూన్ 14న ప్రారంభమై 22 వ తేదీ వరకు ఉంటుంది. ఒక్కరికి సాధారణ టికెట్ రూ. 16200, 3 ఏసీ రూ. 26500, 2 ఏసీ రూ. 35000 ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి ,విజయనగరం,పలాస,బరంపూర్, భువనేశ్వర్.మీదుగా సాగుతుంది. .
ప్యాకేజీ 2: ఐదు జ్యోతిర్లింగ యాత్ర
ఉజ్జయిని (మహాకాళేశ్వర్ -ఓంకారేశ్వర్) – త్రయంబకేశ్వర్ – భీమశంకర్ – ఘృష్ణేశ్వర్. ఈ యాత్రలో మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, భీంశంకర్, ఘృష్ణేశ్వర్, ఎల్లోరా, మోవ్, నాగ్‌పూర్ ప్రాంతాలు సందర్శించవచ్చు. ఈ యాత్ర జూలై 5న ప్రారంభమై 13వ తేదీ వరకు ఉంటుంది. ఒక్కరికి సాధారణ టికెట్ రూ.14,700, 3 ఏసీ రూ.22,900, 2 ఏసీ రూ.29,900 ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్ కామారెడ్డి నిజామాబాద్ ధర్మాబాద్ నాందేడ్, పూర్ణ మీదుగా సాగుతుంది.
కల్పించే సౌకర్యాలు..
రైలు, బస్సు, హోటల్, భోజనాలు (ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం), వాటర్ బాటిల్, టూర్ ఎస్కాట్ సేవలతో సందర్శనా స్థలాలు, (అదనపు ఖర్చు లేదు), ప్రయాణ బీమా, ఇన్సూరెన్స్, రైల్వే స్టేషన్ నుంచి దేవాలయాలకు ప్రయాణం పూర్తిగ ఉచితం. ప్రతి రైలులో 718 మంది ప్రయాణికులు ఉంటారు. ప్రతి 70 మందికి ఇద్దరు కో -ఆర్డినెటర్లు అందుబాటులో ఉండి సౌకర్యాలు సమకురుస్తారు.
కోచ్‌కి ఒక సెక్యూరిటీ గార్డ్, సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుంది.. టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారు వివరాలకు 9701360701, 9281030712, 9281495845, 9281030749, 9281030750 లకు సంప్రదించవచ్చు. మరిన్ని వివరాలకు www.irctctourism.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. తీర్థ యాత్రలను సద్వినియోగం చేసుకోవాలి : డీఎస్‌జీపీ కిషోర్, ఐఆర్సీటీసీ టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్, సికింద్రాబాద్.
ఐఆర్సీటీసీ టూరిజం ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక ప్యాకేజీల కింద రైలులో తీర్థ యాత్రలు చేసేందుకు వీలు కల్పించింది. మొదటి ప్యాకేజీ గంగా రామాయణ పుణ్య క్షేత్ర యాత్ర తీర్థ యాత్ర వచ్చే నెల 14న సికింద్రాబాద్ నుంచి ప్రారంభం. రెండో ప్యాకేజీ తీర్థయాత్ర ఐదు జ్యోతిర్లింగ యాత్ర జూలై 5న ప్రారంభం కానుంది. అన్ని సౌకర్యాలతో తీర్థయాత్రలను సురక్షితంగా చేయవచ్చు. రైలు ద్వారా తీర్థయాత్రలు చేసేందుకు రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకవచ్చిన రెండు ప్రత్యేక ప్యాకేజీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
Rains | హైదరాబాద్‌కు నేడు నైరుతి.. ఎప్పుడైనా భారీ వర్షం కురిసే అవకాశం..!
Metuku Anand | కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు.. కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనం : మెతుకు ఆనంద్
US Visa | క్లాస్‌లు ఎగ్గొట్టినా వీసాలు రద్దు.. విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ కీలక హెచ్చరికలు