Rains | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన సంగతి తెలిసిందే. అంచనా వేసిన సమయం కంటే ముందుగానే రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించడంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇవాళ హైదరాబాద్ నగరాన్ని రుతు పవనాలు తాకనున్నాయి. దీంతో నగరంలో ఎప్పుడైనా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. సిటీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పలు ప్రాంతాల్లో 40 నుంచి 60 మి.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర తీరం వరకు సగటు సముద్రమట్టం నుంచి 3.1 నుంచి 5.8 కి.మీ మధ్యలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం (ఈనెల 27న) ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని, 29లోగా బలపడే సూచనలు ఉన్నాయని పేర్కొన్నది. దీంతో 27,28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
MONSOON ONSET SPELL AHEAD FOR HYDERABAD CITY TODAY ⚠️⛈️
An excellent day of HyderabadRains ahead anytime during late afternoon – midnight with WIDESPREAD Moderate – Heavy Downpours ahead in various parts of the city
Few parts of HYD city can get 40-60mm rains, get ready ⚠️⛈️
— Telangana Weatherman (@balaji25_t) May 27, 2025