Employment Guarantee Scheme | పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 08: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అడిగిన వారందరికి పనులు కల్పించేలా ప్రణాళికలు చేసి, ఎండాకాలం ఎండలను దృష్టిలో ఉంచుకొని జాతీయగ్రామీణ ఉపాధిహామీ పథకం పనులు చేస్తున్న ప్రాంతంలో చలువ పందిళ్లు తాగునీరు, ఓఆర్ఎస్ పాకెట్స్ అందుబాటులో ఉంచాలని జిల్లా గ్రామీణాభివృద్ది అధికారిణి కాలిందిని అన్నారు.
జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం, ఆ పక్కనే ఉన్న ఐకేపీ కార్యాలయాలను ఇవాళ డీఆర్డీవో ఆకస్మికంగా సందర్శించి రికార్డులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పనులు చేస్తున్న వారికి కూలీగా రూ. 307 పడేలాగా కొలతలు ఇచ్చి కూలీలతో పనులు చేయించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు జీవో నెంబర్ 15 ప్రకారం ప్రతీరోజు వర్క్ సైట్ విజిట్ చేయాలని, గుడ్ గవర్నెన్స్ పారామీటర్స్ పై పలు సూచనలు ఇచ్చారు.
అదేవిధంగా ఉపాధిహామి టెక్నికల్ అసిస్టెంట్లకు ఆమె పలు సూచనలు చేశారు. రైతులకు సంబంధించిన పండ్ల తోటలు ఏమైనా ఉంటే గుర్తించి వాటికి అంచనాలు తయారు చేసి ఎస్టిమేట్స్ వేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీఓ ఎండీ ఫయాజ్ అలీ, ఏపీవో రమేష్ బాబు టెక్నికల్ అసిస్టెంట్లు , జేఈ రాజయ్య వెంకటేష్, దివ్య , సురేష్ పలు గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
Shadnagar | రెండు గంటలైనా రాని 108 అంబులెన్స్.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Kunal Kamra | కమెడియన్ కునాల్ కమ్రాకు బాంబే హైకోర్టులో ఊరట
KTR | ఏడాది పాటు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు చేస్తాం : కేటీఆర్