తిరువనంతపురం : ఎల్పీజీ సంక్షోభంతో కేరళవ్యాప్తంగా అనేక హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో కేరళ హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ పోరుబాట పట్టింది. ఈ నెల 23న రాష్ట్రవ్యాప్త సమ్మె నిర్వహించాలని నిర్ణయించింది. నిరసనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేయనున్నట్టు ప్రకటించారు.
అత్యవసర సేవల విభాగంలో హోటళ్లను కూడా చేర్చాలని, తగినంత ఎల్పీజీ సరఫరా చేయాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఎల్పీజీ ధరలను భారీగా పెంచేసి ప్రైవేట్ కంపెనీలు సంక్షోభాన్ని అనుకూలంగా మార్చుకుంటున్నాయని విమర్శించింది. నిరసనలో భాగంగా గురువారం భారీ మార్చ్ నిర్వహిస్తామని తెలిపింది. ప్రస్తుత పరిస్థితితో అటు ఆతిథ్య రంగంతోపాటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నది.