కేడీ పాట వివాదం.. మంగ్లీ క్షమాపణలు
‘కేడీ’ సినిమా తాలూకు పాట వివాదం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. కన్నడ చిత్రం ‘కేడీ: ది డెవిల్' సినిమాలోని పాట ఇది. ధృవ్ సర్జా హీరోగా నటించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు.
‘కేడీ’ సినిమా తాలూకు పాట వివాదం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. కన్నడ చిత్రం ‘కేడీ: ది డెవిల్’ సినిమాలోని పాట ఇది. ధృవ్ సర్జా హీరోగా నటించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఇటీవలే కన్నడతో పాటు ఇతర భాషల్లో ఓ పాటను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో హిందీ వెర్షన్ పాట ‘సర్కే చునార్ తేరి సర్కే’ అసభ్యకరంగా ఉందని దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలొచ్చాయి. దాంతో ఈ పాటను యూట్యూబ్ నుంచి తొలగించారు.
హిందీలో తాను పాడిన తొలిపాట ‘సర్కే చునార్ తేరి సర్కే’ వివాదం కావడంపై గాయని మంగ్లీ సోషల్‌మీడియా వేదికగా క్షమాపణలు చెప్పింది. ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశ్యం తనకు లేదని తెలిపింది. హిందీ లిరిక్స్‌లో మార్పులు చేశామని, త్వరలో అప్డేటెడ్ సాంగ్ విడుదలవుతుందని ఆమె పేర్కొన్నది.
ఇదిలావుండగా..ఈ పాటలో సంజయ్‌దత్‌తో కలిసి నర్తించిన బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఈ వివాదంపై స్పందించింది. హిందీ పాట లిరిక్స్‌లో చేసిన మార్పుల గురించి తనకు తెలియదని చెప్పింది. ‘కన్నడ పాట తాలూకు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ విన్నప్పుడు అసభ్యకరంగా అనిపించలేదు. ఇక హిందీ పాట విషయంలో చిత్రబృందం నా అనుమతి తీసుకోలేదు’ అని ఆమె చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

