తిరువీర్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పాపం ప్రతాప్’. ఎస్పీ దుర్గానరేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కృషి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాకేష్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మాదిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఈ సందర్భంగా బుధవారం కొత్త పోస్టర్ను విడుదల చేశారు. నవ దంపతుల చుట్టూ నడిచే కథ ఇదని, వారి వైవాహిక బంధంలోని అనూహ్య మలుపులు ఉత్కంఠను పంచుతాయని మేకర్స్ తెలిపారు. అజయ్ ఘోష్, ప్రసాద్ బెహరా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కేఎమ్ రాధాకృష్ణ, సురేష్ బొబ్బిలి, దర్శకత్వం: ఎస్పీ దుర్గా నరేష్.