Urea Shortage | ధర్మారం, సెప్టెంబర్ 3: పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలంలో రైతులకు యూరియా వెతలు తీరడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు యూరియా పంపిణీ కోసం క్షేత్రస్థాయిలో గ్రామాలలో ఏర్పాటు చేసినప్పటికీ.. ఆ స్థాయిలో రైతులకు యూరియా అండక ఇబ్బందులు పడుతున్నారు.
ధర్మారం మండల పరిధిలోని రామయ్యపల్లిలోని డీసీఎంఎస్ కేంద్రానికి 270 యూరియా బస్తాలు కేటాయించారు. యూరియా కేంద్రానికి రావడంతో బుధవారం తెల్లవారుజామునే రైతులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆధార్ కార్డులు, పట్టాదారు పాసు పుస్తకాల జిరాక్స్ ప్రజలను క్యూ లైన్ లో పెట్టి రైతులు అక్కడే వేచి ఉన్నారు.270 బస్తాల యూరియా కేంద్రంలో ఉన్నప్పటికీ అవి సరిపోవని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరిపడా యూరియా తెప్పించి ఇబ్బందులు తొలగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ముత్తారంలో..
మరోవైపు ముత్తారం మండల కేంద్రలో యూరియా కోసం క్యూలైన్లో చెప్పులు పెట్టి ఉదయం నుంచి రైతులు ఎదురుచూస్తున్నారు.