Rajiv Yuva Vikasam | పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 21: నిరుద్యోగ యువతకు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని ఆదిశగా చర్యలు చేపడుతూ అర్హులైన వారందరికీ అవకాశాలు లభించేలా చూడాలని పెద్దపల్లి ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి ఎంపీడీవో కార్యాలయంలో పెద్దపల్లిలోని వివిద శాఖలకు చెందిన బ్యాంకుల బ్యాంకు మేనేజర్ లు, ఫీల్డ్ ఆఫీసర్ లు, అధికారులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్దపల్లి మండలంలోని 30 గ్రామపంచాయతీలు ఇంకా అనుబంధగ్రామాలు, పల్లెలను కలుపుకుని మొత్తం 3,989 మంది లబ్దిదారుల నుంచి ధరఖాస్తులు వచ్చాయని వాటిని పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్శ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశం సంబంధిత అధికారులు పాల్గొన్నారు.