Accident | కాల్వ శ్రీరాంపూర్, మే 11 : కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఇద్దులాపూర్ గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికుల కథనం ప్రకారం.. జమ్మికుంట నుండి గోదావరిఖనికి వెళ్తున్న కారు ఇదిలాపూర్ గ్రామ శివారులో జాఫర్ఖాన్పేట గ్రామానికి చెందిన చొప్పరి సదానందంను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో సాదానందం తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు గమనించి వెంటనే అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.