పెద్దపల్లి : జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతుడు ఒడిషాకు చెందిన వలస కూలీగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.