ధర్మారం, జూన్4 : ప్రజల మద్దతుతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడే విధంగా అందరూ కృషి చేయాలని నంది మేడారం పాక్స్ చైర్మన్, జిల్లా సహకార సంఘాల ఫోరం చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం చామనపల్లి, న్యూ కొత్తపల్లి గ్రామాలలో బి.ఆర్.ఎస్ ప్రత్యేక సమావేశాలు పార్టీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయా గ్రామాలలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పాలమాకుల మహేందర్ రెడ్డి, జుంజుపల్లి సురేందర్ పార్టీ గులాబీ జెండాలను ఎగురవేశారు.
అనంతరం న్యూ కొత్తపల్లి గ్రామంలో జరిగిన పార్టీ సమావేశంలో బలరాం రెడ్డి మాట్లాడుతూ గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేసి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు. అలవికాని వాగ్ధానాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. ఇప్పుడు ఆ పార్టీని ప్రజలు నమ్మే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో గ్రామాలలో బీఆర్ఎస్ ను బలోపేతం చేసి ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్లు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, గుర్రం మోహన్ రెడ్డి, పాక్స్ వైస్ చైర్మన్ సామంతుల రాజమల్లయ్య, డైరెక్టర్ పాలమాకుల తిరుపతి రెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కూరపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గాజుల రాజు, చామనపల్లి మాజీ సర్పంచ్ దాసరి తిరుపతి, మాజీ ఉపసర్పంచ్ బూసరాజుల అనిత శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు భూక్య సరిత రాజు నాయక్, మిట్ట తిరుపతి దాడి సదయ్య,
పార్టీ అనుబంధ మండలాధ్యక్షులు నందాల మల్లేశం, గుజ్జేటి కనక లక్ష్మి, అజ్మీరా మల్లేశం, పూస్కురు రామారావు, అయిత వెంకటస్వామి, గంధం నారాయణ, ఆవుల శ్రీనివాస్, ఆవుల వేణు, ఆవుల లత, కాంపల్లి అపర్ణ, నెల్లి విజయ, వేల్పుల రమేష్, గంగాధర సురేష్ ,గంగాధర శ్రీధర్, సంధినేని కొమరయ్య, నిట్టు రాజమల్లు, సుందరగిరి ఎల్లయ్య, నందాల లచ్చయ్య, జెట్టి గంగయ్య, రాజారపు రాయమల్లు, ఆ గిడి శంకరయ్య, సువర్ణ చిన్న రాజయ్య, ఆగిడి సతీష్, ఉత్తర్ల సురేందర్ తదితరులు పాల్గొన్నారు.