MLA vijaya ramana rao | కాల్వ శ్రీరాంపూర్, సెప్టెంబర్ 16 : ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచి పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఉపాధ్యాయులకు సూచించారు. కాల్వ శ్రీరాంపూర్‌లో మంగళవారం ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించి వారిని ఉత్తమంగా తీర్చిదిద్దాలని సూచించారు. విద్యార్థుల సంఖ్యను పెంచి గుణాత్మక విద్య అందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం 18 మంది ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించి మెమొంటో అందజేశారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జగదీశ్వరరావు, ఎంఈఓ మహేష్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, వైస్ చైర్మన్ రాజమల్లు, మాజీ సర్పంచ్ గా జన వీణ సదయ్య, ఆయా పాఠశాలలో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Miyapur | మియాపూర్ డిపోలో విషాదం.. గుండెపోటుతో కండక్టర్ మృతి
KTR | రాజ్యాంగంపై, సుప్రీంకోర్టుపై బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదు : కేటీఆర్
Powerhouse OST | రజినీకాంత్ ‘కూలీ’ నుంచి ‘పవర్‌హౌస్’ ఓఎస్టీ విడుదల