Peddapalli | సుల్తానాబాద్ రూరల్, డిసెంబర్ 30: ఎప్పటికప్పుడు గ్రామాల్లోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య అన్నారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దుబ్బపల్లి, అయిత రాజుపల్లి గ్రామాలను మంగళవారం డీపీఓ వీర బుచ్చయ్య సందర్శించారు. దుబ్బపల్లి గ్రామంలోని సెగిగేషన్ షెడ్డును సందర్శించారు. అనంతరం వర్మీ కంపోస్ట్ తయారు విధానాన్ని పరిశీలించారు.
గ్రామంలో పారిశుధ్య పనులను పూర్తి చేయాలని సూచించారు. పలు విషయాలను పంచాయతీ కార్యదర్శి ప్రత్యూషను అడిగి తెలుసుకున్నారు. జీపీ కార్యాలయంలో సర్పంచ్ ఉమ్మెత్తల శోభ రవీందర్ రెడ్డి ఈ సందర్భంగా డీపీఓకు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. జీపీ భవనం మంజూరు చేయించాలని డీపీఓ దృష్టికి తీసుకువెళ్లారు.
డీపీఓ వెంట ఎంపీఓ సమ్మె రెడ్డి, ఉపసర్పంచ్ తిప్పారపు రాజయ్యతోపాటు తదితరులున్నారు. అలాగే అయిత రాజుపల్లి జీపీని డీపీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుధ్యం 100% ఇంటి పన్ను వసూలు, రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇక్కడ సర్పంచ్ ది కొండ భూమేష్ కుమార్‌తోపాటు తదితరులున్నారు.

Sannia Ashfaq: నా ఇంటిని ముక్కలు చేశారు.. విడాకులపై పాకిస్థాన్ క్రికెటర్ భార్య ఆవేదన