Suicide | పాలకుర్తి/మంథని రూరల్, ఏప్రిల్ 27 : మహిళను హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి పాలకుర్తి మండలం బసంత్‌నగర్ మామిడి తోటలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన ఇవాళ చోటు చేసుకుంది. బసంత్‌నగర్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంథని మండలం లక్కేపూర్ గ్రామానికి చెందిన పండుగు మొగిళి అలియాస్ చంద్రమౌళి(45) గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
కాగా గత కొంతకాలంగా మృతుడు పెగడపల్లి గ్రామం జైపూర్ మండలానికి చెందిన వివాహిత మహిళతో తరచుగా ఫోన్లు మాట్లాడేవాడు. ఈ విషయమై కుటుంబసభ్యులు ఎన్ని సార్లు చెప్పినా తన ప్రవర్తన మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో మాసు రమాదేవి ఈ నెల 25వ తేదీన లక్కెపూర్ గ్రామ శివారులో హత్యకు గురైన విషయం విదితమే. ఈమెను హత్య చేసింది మొగిళి అని మృతురాలి కుటుంబ సభ్యులు మంథని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రమాదేవి హత్య జరిగినప్పటి నుంచి పరారిలో ఉన్న మొగిళి సోమవారం బసంత్‌నగర్‌లోని మామిడి తోటలో ఉరివేసుకొని శవమై కనిపించాడు. మృతుడి కుమారుడు పండుగ అభిషేక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Migratory birds | పెరుంగులమ్ రిజర్వాయర్‌లో వలస పక్షుల సందడి.. Video
Mission Bhageeratha | మిషన్ భగీరథపై నిర్లక్ష్యం.. నీరు వృథాగా పోతున్నా పట్టింపే లేదు
PVNR Expressway | పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై రెండు కార్లు ఢీ.. భారీగా ట్రాఫిక్ జామ్