పెద్దపెల్లి : పెద్దపల్లి జిల్లాలో పార్టీ బలోపేతానికి సింగరేణి కార్మికులు, పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు పిలుపునిచ్చారు. గురువారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని ఎన్ఎస్ గార్డెన్లో సీపీఐ జిల్లా నాలుగో మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై జెండా ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టారు.
మోదీ అమిత్ షాలు ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసులను, మావోయిస్టులను హతమారుస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర నాయకులు శంకర్, జిల్లా నాయకులు సదానందం, గౌతం, గోవర్ధన్, కనకరాజు, మోహన్, స్వామి, వైవి రావు, వాసిరెడ్డి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.