మంథని, మార్చి23: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హైస్కూల్లో 2001-02 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పండుగలా జరిగింది. మంథని పట్టణంలోని ఎస్ఎల్బీ ఫంక్షన్ హాలులో జరిగిన ఈ గెట్ టు గెదర్‌లో పూర్వ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 25 ఏండ్ల తర్వాత స్నేహితులందరూ కలుసుకోవడంతో తమ చిన్ననాటి మధురస్మృతులను గుర్తుచేసుకున్నారు. చదివిన బడి, నాడు గురువులను నేర్పిన క్రమశిక్షణ, చదువుతో ఈరోజు వివిధ స్థాయిలో ఉన్నామని తెలిపారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో అందరూ ఉత్సాహంగా పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అల్లం వీరయ్య, భాగవతుల శంకర్, పవిత్రం భూమయ్య, గీట్ల భరత్ రెడ్డి, నారంభట్ల సుశీల, ఘనుకోట సునీత, పూర్వ విద్యార్థులు బండారి సమ్మయ్య, రావుల సతీశ్, రావికంటి రాకేశ్, పెంటరి సంతోశ్, మీసాల రాజు, మధూకర్, సంతోశ్, రవి, అశోక్, శ్రీనివాస్‌తో తదితరులు ఉన్నారు.