గోదావరిఖని : కేసీఆర్ పాలనలో తెలంగాణ పదేళ్లు పచ్చగా కళకళలాడిందని, అసమర్థ కాంగ్రెస్ పాలనలో కరువుకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం గోదావరి నదిని ( Godavari River)సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేసీఆర్ ఎంతో గోప్పగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి గోదావరి నదిని నిండుకుండలాగా మార్చరన్నారు. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గోదావరినదిపై తెప్పల పోటీలు నిర్వహించామని గుర్తు చేశారు.
మహశివరాత్రి పర్వదినం నాడు భక్తులు గోదావరినది స్నానం ఆచరించడం ఆనవాయుతీగా వస్తుందన్నారు. నదీ స్నానాలు చేసేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, ఇది కాంగ్రెస్ పార్టీ అసమర్థత పాలనకు నిదర్శనం అన్నారు. అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకన్న, కోడి రామకృష్ణ ఆవునూరి వెంకటేష్, రామరాజు ఉన్నారు.