Korukanti Chander | గోదావరి ఖని, డిసెంబర్ 2 : రామగుండంలో రాష్ట్రంలోనూ కమిషన్ల పాలన నడుస్తోందని, ప్రశ్నించిన ప్రతిపక్షాలను బద్నాం చేసే కుట్రలు చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రామగుండంలో రాష్ట్రంలో ప్రతీ పనికి కమిషన్లు లభించే విధంగా వ్యవహారం నడుస్తుందని ఆయన విమర్శించారు.
పర్మిషన్లు లేనిదే కార్యక్రమాలు జరగవనే విధంగా ప్రజాప్రతినిధులు ముందుకు సాగుతున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఇకపై థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టం, గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ లు నెలకొల్పుతామని చెప్పారని సీఎం మాట్లాడిన విషయంపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడితే రామగుండంలో హరీష్ రావు పవర్ ప్లాంట్ వద్దంటున్నారని అబద్ధపు మాటలు చెబుతూ దిష్టి బొమ్మ దగ్ధం చేస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
దమ్ముంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు అడిగిన వాటిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకానీ రూపాయికి పావలా కూడా పలుకని నాయకులు మాజీ మంత్రిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా..? ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.
ఎన్టీపీసీ యాజమాన్యం ఒక యూనిట్‌కు 4 రూపాయల 70 పైసలకే ఇవ్వడానికి సిద్ధంగా ఉండగా..? మంత్రి వర్గ కేబినెట్ ఇచ్చిన డీపీఆర్ రూ.10,800 కోట్ల ప్రకారం యూనిట్‌కు 7 రూపాయల 40 పైసలు పడుతుందని.. అలాంటప్పుడు కమీషన్ల కోసమేనా థర్మల్ పవర్ ప్లాంట్లు అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించడం జరిగిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి కోసం బీఆర్ఎస్ పార్టీపై అబద్ధపు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. రామగుండంలో జరుగుతున్నది దౌర్జన్యం, అవినీతి, కూలగొట్టడం మాత్రమేనని ఆరోపించారు.
ఇసుక అమ్ముకొని బతుకడమే పనిగా..
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇసుక అమ్ముకొని బతుకడమే పనిగా పెట్టుకున్నారని కోరుకంటి చందర్ ఆరోపించారు. కూల్చివేతలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నరన్నారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి గోపు ఐలయ్య యాదవ్, బాదే అంజలి, గాధం విజయ, కల్వచర్ల కృష్ణవేణి, కవితా సరోజినీ, నూతి తిరుపతి, నారాయణ దాసు మారుతి బుర్రి వెంకటేష్ సట్టు శ్రీనివాస్, కోడి రామకృష్ణ,కిరణ్ జీ,జక్కుల తిరుపతి, నిమ్మరాజుల సాగర్ తిమోతి, గుంపుల లక్ష్మి, గుర్రం పద్మ, కనకలక్మి తదితరులు పాల్గొన్నారు
తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కనబడిన వాటిని రోడ్డు వెడల్పు, అభివృద్ధి పేరుతో కూల్చివేస్తూ పోతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో అంతా మోసమేనని, ఆరు గ్యారంటీలను అటకెక్కించారని, 42 శాతం బీసీ రిజర్వేషన్లు అంటూ బిల్లు పెట్టి, ఆర్డినెన్స్ తీసుకువచ్చి తీరా సర్పంచ్ ఎన్నికల్లో 17 శాతమే ఇచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తే కేసులు పెట్టే పోలీసులు, అధికార పార్టీ నాయకులు మాజీ మంత్రి దిష్టి బొమ్మ దగ్ధం చేస్తే ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు.
Sanchar Sathi App: సంచార్ సాథీ యాప్‌ను డిలీట్ చేసుకోవచ్చు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి సింథియా