Putta Madhukar | మంథని, ఏప్రిల్ 28 : తెలంగాణ సాధన కోసం ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన రజతోత్సవ సభలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పీచ్ ప్రజల్లో ఉత్సాహం నింపిందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రజతోత్సవ సభకు ఎన్ని అడ్డంకులు పెట్టినా మంథని నియోజకవర్గంలోని కమాన్ పూర్, రామగిరి, ముత్తారం, మంథని, మల్హర్, కాటారం, మహాముత్తారం, మహదేవ్ పూర్, పలిమేల మండలాల నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, కర్షకులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ఆటో డ్రైవర్లు, వివిధ వర్గాలకు చెందిన వారు స్వచ్ఛందంగా తరలివచ్చి సక్సెస్ చేసినందుకు ఆయన ధన్యవాదములు తెలియజేశారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలను కార్యకర్తలను, అభిమానులను సభకు తీసుకువెళ్లి.. సభ సక్సెస్‌కు కృషిచేసిన ప్రతీ ఒక్కరికి పుట్ట మధుకర్ కృతజ్ఞతలు తెలిపారు. రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడిన ప్రతీ మాటను అర్థం చేసుకోవాలని ఆయన స్ఫూర్తితోనే ముందడుగు వేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివచ్చిన కార్మికులు, కర్షకులు, మేధావులు, పార్టీ శ్రేణులు అన్ని వర్గాల ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Migratory birds | పెరుంగులమ్ రిజర్వాయర్‌లో వలస పక్షుల సందడి.. Video
Mission Bhageeratha | మిషన్ భగీరథపై నిర్లక్ష్యం.. నీరు వృథాగా పోతున్నా పట్టింపే లేదు
PVNR Expressway | పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై రెండు కార్లు ఢీ.. భారీగా ట్రాఫిక్ జామ్