మంథని రూరల్, ఫిబ్రవరి 9: ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని(Ration rice) అక్రమంగా తరలిస్తుండగా పోలీస్, సివిల్ సప్లై అధికారులు ఆదివారం ఉదయం పట్టుకున్నారు. ఏపీ 20 వై 7659 అనే నెంబర్ అప్పి ట్రాలీ ఆటోలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు మండలంలోని నాగారం గ్రామం వద్ద సివిల్ సప్లై అధికారులతో కలిసి పట్టుకున్నట్లు ఎస్ఐ రమేష్ వివరించారు. ట్రాలీలో 20 ప్లాస్టిక్ బ్యాగ్‌ల్లో 9 క్వింటాళ్ల రేషన్ బియ్యం లభ్యమయ్యాయన్నారు. ఈ బియ్యాన్ని కాసు రాజు, కాసు ఒదులు, డ్రైవర్ కుర్ర సమ్మయ్యలపై కేసు నమోదు చేసినట్లు తాయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Biren Singh | మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా..!
India vs England 2nd ODI | ముగిసిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
Lawyers | న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని తీసుకురావాలి : ఐఏఎల్