Lawyers | హిమాయత్ నగర్, ఫిబ్రవరి9 : రాష్ట్రంలోని న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్) రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హిమాయత్ నగర్లోని సంఘం కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని జూనియర్ న్యాయవాదులకు ఉపకార వేతనాలు, లైబ్రరీ ఏర్పాటుకు రుణాలు ఇవ్వాలన్నారు. న్యాయవాదుల సంక్షేమం కోసం బడ్జెట్లో నిధులు కేటాయించి, హైకోర్టులో న్యాయమూర్తుల నియామకంలో న్యాయవాదుల కోటా నుంచి భర్తీ చేయాలని కోరారు. న్యాయవాదులపై దాడికి పాల్పడే వారికి సకాలంలో శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు దూస్స జనార్ధన్, న్యాయవాదులు ఉదయ భాస్కర్, భీమ నాథ్ శ్రీనివాస్, మల్లేపల్లి ఆదిరెడ్డి, కేవిఎల్, రాములు లతీఫ్, గణేష్, బత్తిని రాము, అనిత, ఉత్తమ్ కుమార్,సుభాష్, జయ శ్రీనివాస్, వెంకటేశం గుర్రం వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.