Pratima Singh | మెదక్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులతో పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. బుధవారం మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలం తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా నిర్వహించారు. కిసాన్ మేళాకు ముఖ్యఅతిథిగా కలెక్టర్ ప్రతిమాసింగ్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కిసాన్ మేళా సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ స్టాళ్లను కలెక్టర్ ప్రారంభించి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులు , వ్యవసాయ రంగంలో జరుగుతున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా రైతులు నూతన సాంకేతిక పద్ధతులను అవలంబిస్తూ ఆధునిక వ్యవసాయం చేయాలన్నారు. రైతులకు అందుబాటులో ఉన్న ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులు, పంటల నిర్వహణ విధానాలు, యంత్రాల వినియోగం, పంట రక్షణ చర్యలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆసక్తిగా సందర్శించి రైతులతో ముచ్చటించారు. ప్రజా పాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా కిసాన్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
రైతులు, శాస్త్రవేత్తలు సూచించే ఆధునిక పద్ధతులను అనుసరించడం ద్వారా పంటల దిగుబడిని పెంచుకోవచ్చని తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న శిక్షణలు, శాస్త్రీయ సూచనలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పంట మార్పిడి పద్ధతులను అమలు చేయడం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు.
అధిక సాంద్రత సాగుపై కిసాన్ మేళా..
తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ & జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవకుమార్ ఆధ్వర్యంలో అధిక సాంద్రత సాగుపై కిసాన్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ మాట్లాడుతూ.. రైతులు సంప్రదాయ వ్యవసాయంతో పాటు వాణిజ్య పంటలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వెయ్యి మంది రైతులు పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు.
జిల్లా గ్రంధాలయాల చైర్మన్ సుహాసిని రెడ్డి మాట్లాడుతూ.. రైతు లేనిదే మునుగడ లేదన్నారు. రైతులు నష్టాలకు ఓర్చి భూమిని నమ్ముకొని ఆశలతో బతుకుతారని, వారిని ఎంతైనా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయిల్ ఫామ్ సమస్యలను కూడా అధికారుల రైతులకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో. రామకృష్ణ, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ నల్కర్ , ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ , జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య, స్థానిక సర్పంచ్లు ,రైతు సోదరులు పాల్గొన్నారు.

Assembly Elections | అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్
Mallikarjun Kharge: మమ్ముల్ని ప్రేమించారు.. మోదీని పెళ్లి చేసుకున్నారు: మల్లిఖార్జున్ ఖర్గే
TS Assembly | యూరియా యాప్ పేరుతో ప్రభుత్వం రైతులను వేధిస్తోంది : మాజీ మంత్రి వేముల