గోదావరిఖని : రాష్ట్రంలో రైతాంగానికి సాగునీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అన్న దాతలను గోస పెడు తుందని, రైతాంగానికి సాగు నీరు అందించేందుకు కాళేశ్వరం జోన్ పరిధిలో ఉన్న ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. కాంగ్రెస్కు నీళ్లవ్వడం చేతకాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్కు అప్పగిస్తే మూడు రోజుల్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. అదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మాజీ ఎమ్మెల్యే చందర్ నివాసంలో ఎర్పాటు చేసిన మీడియా సమావేశం ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధిలో ముందుకు సాగి సుభిక్షంగా ఉంటే అజ్ఞాని రేవంత్ పాలనలో రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లిందన్నారు.
మూర్ఖపు పాలనలో ప్రజలు విసిగిపోతున్నారన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని కేసీఆర్ సుభిక్షంగా ఉంచితే ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి అప్పల పాలు చేస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు రైతాంగానికి కావాలనే నీళ్లు అందించడం లేదన్నారు. లక్షలాది ఎకరాలకు కావాల్సిన సాగునీరు సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు, కంపు మాటలతో కాలం వెళ్లదిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, నీళ్ల మంత్రి అజ్ఞానంగా వ్యవహరిస్తున్నారని, కేసీఆర్ పాలనలో సుభిక్షంగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని రేవంత్ రెడ్డి అప్పుల పాలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు జోన్ పరిధిలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, కన్నెపల్లి బ్యారేజీలకు ఎలాంటి ఇబ్బందులు లేవని, లక్షలాది ఎకరాలకు నీళ్లందించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. సమావేశంలో నాయకులు కౌశిక హరి నడిపెల్లి మురళీధర్ రావు, పి.టి.స్వామి, పెంట రాజేష్, బొడ్డు రవీందర్, నారాయణదాసు మారుతి, చిలకలపల్లి శ్రీనివాస్, అచ్చే వేణు, నూతి తిరుపతి, ఇంజపూరి నవీన్, జిట్టవేన ప్రశాంత్, ఇరుగురాళ్ల శ్రవన్, బుర్ర వెంకటేష్, చింటూ తదితరులు పాల్గొన్నారు.