పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 26: పిల్లలకు ఎదిగే దశలో చదువు జ్ఞానాన్ని అందిస్తుందని అందుకే వారికి చిన్నతనం నుంచే మంచి పౌష్టికరమైన ఆహారం అందించాలని ఎఫ్సీఐ మేనేజర్ వెంకటేశ్ సాగర్ అన్నారు. జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణంలోని శాంతి నగర్ అంగన్వాడీ కేంద్రాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. పిల్లలకు ఇవ్వాల్సిన డైట్ ఆహారంతో పాటు సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం చిన్నారులకు పండ్లు, బ్రెడ్, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎఫ్సీఐ సిబ్బంది ఆకుల రాజేష్, అసిస్టెంట్ మేనేజర్ విష్ణు వర్ధన్, మహేందర్, సాయి కళ్యాణ్, తిరుపతి, లయన్స్ క్లబ్ ఆఫ్ చార్టర్ ప్రెసిడెంట్, మాజీ కౌన్సిలర్ లైశెట్టి భిక్షపతి, అంగన్వాడీ కేంద్రం టీచర్ అనిత, సిబ్బంది పాల్గొన్నారు.