పెద్దపల్లి : బావిలో దూకి వృద్ధురాలు బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన చల్లా రాజమ్మ(78) అనే వృద్ధురాలు గత కొన్ని సంవత్సరాలుగా బీపీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నది.
వ్యాధుల కారణంగా మనసికంగా కృంగిపోయి జీవితంపై విరక్తి చెంది తన ఇంటికి సమీపంలో ఉన్న చేదబావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది. మృతురాలి కొడుకు చల్లా గంగయ్య ఫఙర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.