పెద్దపల్లి రూరల్ అక్టోబర్ 05 : విజయదశమి పండుగను పురస్కరించుకుని అమ్మవారు (దుర్గమాత) తొమ్మిది రోజుల ఉత్సవాల అనంతరం దుర్గమాత నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని పెద్దపల్లి (Peddapalli) మండలంలోని పలు గ్రామాల్లో గత రెండురోజులుగా భక్తులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మండలంలోని భోజన్నపేటలో దుర్గమాత అమ్మవారి ఉత్సవ నిర్వహణ కమిటీల ఆద్వర్యంలో మహిళల కోలాట నృత్యాలు, భక్తుల ఆట పాటలతో అర్థరాత్రి దాకా భక్తిశ్రద్దలతో వాడవాడలా అమ్మవారిని ఊరేగించిన అనంతరం నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
అంతకు ముందు భోజన్నపేట, చీకురాయి గ్రామాల్లోని అమ్మవారి విగ్రహాల వద్ద పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, బిఆర్ ఎస్ నియోజకవర్గ ఇంచార్జి దాసరిమనోహర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా అమ్మవారి ఆశీష్షులతో ప్రజలందరిపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని, ఉంచాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.