CP Srinivas | ముత్తారం, ఫిబ్రవరి 20 : మండలంలోని ఖమ్మంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో బ్లాక్ 1,2 ఇసుక క్వారీలను రామగుండం సీపీ శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా క్వారీల్లోని రికార్డులను పరిశీలించారు. ప్రతీ రోజు ఎన్ని లారీలు లోడ్ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఓవర్ లోడ్‌తో లారీలు వెళ్తున్నాయా..? ఎక్కడ తూకం వేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.
అదే విధంగా వే బిల్లులు సరిగా ఉన్నాయా..? లేదా అని తనిఖీ చేయడంతోపాటు వే బ్రిడ్జ్ కాంటా పని చేస్తుందా లేదా అని పోలీస్ వాహనాలు కాంటాపైన ఎక్కించి తూకం వేశారు. నిబంధనలకు విరుద్దరంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓవర్ లోడ్ లారీలు పట్టుబడితే జరిమానాలు విధిస్తామని అన్నారు. సీపీ శ్రీనివాస్ వెంట డీసీపీ చేతన, ఏసీపీ మడత రమేష్, సిఐ రాజు, ఎస్సై గోపతి నరేష్ తదితరులు ఉన్నారు.
Rekha Gupta | శీష్ మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం : రేఖా గుప్తా
Emergency Landing | దుబాయ్ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య.. నాగ్‌పూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
KCR | ఏఐజీ హాస్పిటల్‌కు కేసీఆర్.. సాధారణ పరీక్షల కోసమే!