సుల్తానాబాద్ రూరల్ నవంబర్ 12 : ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్న బొంకూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.
మ్యాచర్ వచ్చిన వెంటనే త్వరగతినా కొనుగోలు చేసి మిల్లులకు ధాన్యం తరలించాలని సంఘ కార్యదర్శి రమేష్ కు, కొనుగోలు నిర్వాహకులకు సూచించారు .
రైతు సోదరులు వరి కోతలు ముగించి ధాన్యం మ్యాచరు వచ్చేవరకు ఆరబెట్టి సెంటర్లకు తీసుకురా వాలన్నారు. సెంటర్లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గన్నీస్, లారీలు, అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన వెంట (డిసిఎస్ఓ)జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, డిటిఓ, తదితరులు ఉన్నారు.