పెద్దపల్లి రూరల్ అక్టోబర్ 01 : త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగ్ రూంల విషయంలో సంబంధిత శాఖల అధికారులు అవసరమైన ఏర్పాట్లను సక్రమంగా చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి మండలంలోని పెద్దబొంకూర్ లో గల మదర్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూంల పరిస్థితిని బుధవారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో కలిసి మదర్ థెరిస్సా కళాశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాలన్నారు. ఎక్కడ ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వ మార్గదర్శకాలు నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ వెంట పెద్దపల్లి ఆర్ డీవో బొద్దుల గంగయ్య, పెద్దపల్లి జోన్ డీసీపీ కరుణాకర్, ఏసీపీ గజ్జి కృష్ణయాదవ్, తహసీల్దార్ దండిగ రాజయ్య యాదవ్ , ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. శ్రీనివాస్, ఏవో పవన్ కుమార్ , పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరనేని నిశాంత్ రావు, తదితరులు పాల్గొన్నారు.