Coal India | గోదావరిఖని, జనవరి 6 : కోల్ ఇండియాలో పని చేస్తున్న అధికారులకు గ్రాట్యుటీని రూ. 25 లక్షలకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం చెల్లిస్తున్న 20 లక్షలు రూపాయలకు మరో ఐదు లక్షలు పెంచుతూ కోల్ ఇండియా యాజమాన్యం జనవరి 5న సర్కులర్ జారీ చేసింది.
ఇండస్ట్రియల్ డీఏ 50 శాతానికి మించి 51.8 శాతానికి చేరుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యజమాన్యం సర్కులర్లో పేర్కొంది. పెంచిన గ్రాట్యుటి మొత్తం 1-10-25 నుండి అమల్లోకి వస్తుందని సర్కులర్లో పేర్కొన్నారు. కోల్ ఇండియాలో అమలు చేసిన గ్రాట్యుటీ పెంపు సింగరేణిలో వెంటనే అమలు చేయాలని సింగరేణి అధికారులు డిమాండ్ చేస్తున్నారు.