Coal city | సప్లయ్ మెరుపు దాడులు.. సబ్సిడీ గ్యాస్ వాడుతున్న పలు హోటళ్లపై కేసులు
రామగుండం నగర పాలక సంస్థ పరిధి గోదావరిఖని నగరంలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి శ్రీనాధ్ ఆధ్వర్యంలో అధికారులు బుధవారం మెరుపు దాడులు చేపట్టారు.
కోల్ సిటీ, మార్చి 18: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశాల మేరకు రామగుండం నగర పాలక సంస్థ పరిధి గోదావరిఖని నగరంలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి శ్రీనాధ్ ఆధ్వర్యంలో అధికారులు బుధవారం మెరుపు దాడులు చేపట్టారు. నగరంలోని ధనలక్ష్మీ క్యాంటీన్, శంకరయ్య హోటల్, సీతానగర్ వద్ద గల హోటల్, అక్షయ టిఫిన్స్ సెంటర్,శ్రీనివాస వైన్స్ క్యాంటీన్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తుండటంను గుర్తించి ఐదు సిలిండ్లను సీజ్ చేసి కేసులు నమోదు చేసినట్లు సివిల్ అధికారి శ్రీనాథ్ తెలిపారు.
ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ దాడులు నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామనీ, నిబంధనలు అతిక్రమించి వంట గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. బుధవారం కేసులు నమోదైన హోటళ్ల యజమానులకు నోటీసులు జారీ చేసి అనంతరం జరిమానా విధిస్తామని తెలిపారు. అవసరమైతే క్రిమినల్ కేసులు సైతం నమోదు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

