Korukanti Chander | గోదావరి ఖని, ఏప్రిల్ 28: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కుంభమేళా తరహాలో జరిగిందని.. బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సభ చరిత్రలో నిలిచిపోతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ తెలిపారు. ఈ సభను విజయవంతం చేసినవారందరికి కోరుకంటి చందర్ ధన్యవాదాలు తెలియజేశారు.
ఇవాళ గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ వెంట ఉన్నారని.. మొన్నటి ఎన్నికల్లో మోసపోయామని , నిన్న ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిరూపించిందన్నారు. రామగుండం నియోజకవర్గం ఒక ఉద్యమాల పురిటిగడ్డగా పేరొందిందని, ఉద్యమ సమయంలో ఏ పిలుపిచ్చినా ప్రభంజనంలా తరలివచ్చిన ప్రజానీకం నిన్నటి రజతోత్సవ సభకు ఈ ప్రాంతం నుండి భారీగా తరలివచ్చి విజయవంతం చేసినందుకు, వారిని సభకు తరలించడంలో కష్టించిన మాజీ ప్రజా ప్రతినిధులకు, గులాబీ సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీసి అడగాలి..
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపిందని అన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠంపై గులాబీ జెండా ఎగురవేసే దిశగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడగడానికి వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీసి అడగాలన్నారు.
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన రజతోత్సవ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కోరుకంటి చందర్ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పుచేశామన్న భావనలో తెలంగాణ ప్రజానీకం ఉందని, మళ్లీ కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు.
ఈ సమావేశంలో నాయకులు నడిపెల్లి మురళీధర్ రావు, గోపు ఐలయ్య యాదవ్, కుమ్మరి శ్రీనివాస్, పాముకుంట్ల భాస్కర్, కల్వచర్ల కృష్ణవేణి, బొడ్డు రవీందర్, ముద్దసాని సంధ్యారెడ్డి, నీరటి శ్రీనివాస్, నారాయణదాసు మారుతి, అచ్చే వేణు, మెతుకు దేవరాజు, నూతి తిరుపతి, సట్టు శ్రీనివాస్, బుర్ర వెంకన్న, ఆవునూరి వెంకటేష్, కర్రీ ఓదేలు తదితరులు పాల్గొన్నారు.
Migratory birds | పెరుంగులమ్ రిజర్వాయర్లో వలస పక్షుల సందడి.. Video
Mission Bhageeratha | మిషన్ భగీరథపై నిర్లక్ష్యం.. నీరు వృథాగా పోతున్నా పట్టింపే లేదు
PVNR Expressway | పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వేపై రెండు కార్లు ఢీ.. భారీగా ట్రాఫిక్ జామ్