ధర్మారం, ఆగస్టు26 : యూరియా కొరతపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ నాయకులు కదం తొక్కారు. మండల కేంద్రంలోని కరీంనగర్- రాయపట్నం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ నినదించారు. అలాగే ఆల్కహాల్ ఫుల్ – యూరియా నిల్ అంటూ ఎద్దేవా చేస్తూ నినదించారు. దీంతో ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో రాస్తారోకోను విరమింప చేశారు.
ఈ సందర్భంగా నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పాలన వస్తే పాత రోజులు వస్తాయని చెప్పారని ఆయన వివరించారు. కేసీఆర్ చెప్పిన మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తీవ్రమైన యూరియా కొరత ఏర్పడిందని ఆయన విమర్శించారు. వానాకాలంలో సాగు చేసిన వరి పొలాలకు సరి అయిన యూరియా దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సరిపడా యూరియా తెప్పించి రైతులకు న్యాయం చేయాలని లేని పక్షంలో బీఆర్ఎస్ తరఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, నంది మేడారం ప్యాక్స్ వైస్ చైర్మన్ సామంతుల రాజ మల్లయ్య, డైరెక్టర్ భారత స్వామి, ఏఎంసీ మాజీ చైర్మన్లు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి , గుర్రం మోహన్ రెడ్డి, మండల మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండి రఫీ, మాజీ ఎంపీటీసీ సభ్యులు తుమ్మల రాంబాబు, దాడి సదయ్య, మిట్ట తిరుపతి, గాగి రెడ్డి వేణుగోపాల్ రెడ్డి, భూక్య సరిత రాజు నాయక్, మోతే సుజాత శ్రీనివాస్, మాజీ సర్పంచులు జనగామ అంజయ్య, రెడపాక ప్రమీల శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ ఆవుల లత, రైతు బంధు సమితి మాజీ మండల అధ్యక్షుడు పాకాల రాజయ్య, జిల్లా మాజీ సభ్యుడు ఎగ్గేల స్వామి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కూరపాటి శ్రీనివాస్, పార్టీ మండల ఉపాధ్యక్షులు నాడెం శ్రీనివాస్, గాజుల రాజు, పార్టీ అనుబంధం మండలాధ్యక్షులు గుజ్జేటి కనక లక్ష్మి, దేవి నలినీకాంత్, దేవి వంశీకృష్ణ, మంద శ్రీనివాస్, అజ్మీర మల్లేష్ నాయక్, పార్టీ నాయకులు పాక వెంకటేశం, అయిత వెంకటస్వామి, బొడ్డు రాములు ,చింతల తిరుపతి, సాన రాజేందర్, మిట్ట భరత్ మానుపాటి సాగర్ , ఎండీ అజాం బాబా, దేవి రాజేందర్ ,గంధం తిరుపతి, రాగుల చిన్న మల్లేశం, అజ్మీర శ్రీనివాస్ ,చిదుగు సంపత్, దాగేటి శంకరయ్య, అజ్మీరా తిరుపతి నాయక్, బొలిశెట్టి సుధాకర్, కల్లేపల్లి లింగయ్య, తాళ్ల రాజయ్య, బొంతల నర్సింగం తదితరులు పాల్గొన్నారు.